తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

208 New Positive Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  20 Sep 2021 3:09 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. భారీగా త‌గ్గిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 45,274 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 208 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. నిన్న క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,906కి పెరిగింది. నిన్న 220 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,54,765కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.65 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి.



Next Story