తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

2047 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన

By Medi Samrat  Published on  16 Jan 2022 2:55 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 55,883 కరోనా పరీక్షలు చేయగా.. 2,047 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,09,209కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ముగ్గురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,057కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,013 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,83,104కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 22,048 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల‌లో జీహెచ్ఎంసీ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.


Next Story