బీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన 20 మంది కార్పొరేటర్లు

రామగుండం మునిసిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు చెందిన 20 మంది కార్పొరేటర్లు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

By Medi Samrat  Published on  4 March 2024 6:45 PM IST
బీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన 20 మంది కార్పొరేటర్లు

రామగుండం మునిసిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు చెందిన 20 మంది కార్పొరేటర్లు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ల నేతృత్వంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు 20 మంది కార్పొరేటర్లులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ రోజు పార్టీ లో చేరిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామ‌న్నారు. ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాం. ఇప్పటికే నాలుగు గ్యారంటీ లు అమలు చేశాం. ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త వాళ్ళను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. రామగుండం ప్రజల తరపున ఇంచార్జ్ దీప దాస్ మున్షికి ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story