మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షంలో ప్లైఓవర్‌పై వెళుతున్న బైక్‌పై పిడుగు పడింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ కాలనికి చెందిన కుటుంబం ఫ్లైఓవర్ మీదకు వెళ్తోంది. అదే సమయంలో వర్షం కురుస్తోంది. ఈ సమయంలో రైల్వే వంతెన వద్ద బైక్‌పై పిడుగు పడింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిపై పిడుగుపాటుతో భార్య, భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న‌లో మూడేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి నుంచి మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు పడ్డాయని అధికారులు చెప్తున్నారు.


సామ్రాట్

Next Story