తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

196 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  12 Oct 2021 4:48 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 44,310 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 196 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,266కి చేరింది. నిన్న క‌రోనాతో ఒక‌రు మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,933కి పెరిగింది. నిన్న 201 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,60,143కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 4,190 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.78 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.



Next Story