తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

1920 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన

By Medi Samrat  Published on  11 Jan 2022 2:59 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 83,153 కరోనా పరీక్షలు చేయగా.. 1,920 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,97,775కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఇద్ద‌రు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,045కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 417 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,77,234 కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.





Next Story