తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. భారీగా న‌మోద‌వుతున్న కేసులు

1913 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన

By Medi Samrat  Published on  6 Jan 2022 2:49 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. భారీగా న‌మోద‌వుతున్న కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 54,534 కరోనా పరీక్షలు చేయగా.. 1,913 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,87,456కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,036కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 232 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,75,573 కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.






Next Story