తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,33,134 శాంపిళ్లను పరీక్షించగా 1,897 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,000కి చేరింది. నిన్న ఒక్క రోజే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,409కి పెరిగింది. నిన్న 2,982 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,67,285కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,306 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 182 కేసులు నమోదు అయ్యాయి.