తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1825 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో

By Medi Samrat  Published on  10 Jan 2022 3:10 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 70,697 కరోనా పరీక్షలు చేయగా.. 1,825 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,95,855కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఒక‌రు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,043కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 351 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,76,817 కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.





Next Story