తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1813 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,29,896 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  9 Jun 2021 4:00 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,29,896 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా 1,813 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813కి చేరింది. నిన్న ఒక్క రోజే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,426కి పెరిగింది. నిన్న 1,801 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,69,086కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా ఖ‌మ్మంలో 180 కేసులు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 179 కేసులు న‌మోదు అయ్యాయి.


Next Story