తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,20,525 శాంపిళ్లను పరీక్షించగా 1,771 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,02,089కి చేరింది. నిన్న ఒక్క రోజే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,469కి పెరిగింది. నిన్న 2,384 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,76,487కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 149 కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 171 కేసులు నమోదు అయ్యాయి.