తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

170 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  26 Sep 2021 3:07 PM GMT
తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 34,200 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 170 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,068కి చేరింది. నిన్న క‌రోనాతో మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,912కి పెరిగింది. నిన్న 259 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,56,544కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 4,612 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.71 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.



Next Story