కడుపులో నుండి 156 రాళ్లను బయటకు తీసిన వైద్యులు

156 Kidney Stones Removed from a Patient in Hyderabad. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రోగి శరీరంలోని 156 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు.

By Medi Samrat  Published on  17 Dec 2021 12:01 PM IST
కడుపులో నుండి 156 రాళ్లను బయటకు తీసిన వైద్యులు

హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రోగి శరీరంలోని 156 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు. 50 ఏళ్ల వృద్ధురాలి కిడ్నీ నుంచి కీహోల్ ద్వారా రాళ్లను తొలగించారు. దేశంలోనే తొలిసారిగా ఒకే సమయంలో రోగి శరీరం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. పెద్ద శస్త్ర చికిత్స లేకుండానే ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ సాయంతో హుబ్లీకి చెందిన ఓ మహిళ కిడ్నీలోంచి రాళ్లను తొలగించినట్లు హైదరాబాద్‌లోని ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రి పేర్కొంది. ఆమె ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆమెకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడంతో పరీక్ష చేయించుకున్నారు. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

గత 2 సంవత్సరాలుగా ఆమె కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని అంటున్నారు. గత రెండేళ్లుగా ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా ఆ మహిళకు తీవ్ర నొప్పి వచ్చింది. ఆ తర్వాత మహిళకు పరీక్షలు చేయగా.. ఆమె రిపోర్టు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. శస్త్రచికిత్స లేకుండానే ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ చేయాలని డాక్టర్ నిర్ణయించారు. 3 గంటలు పాటూ ఈ పరీక్షలు చేసారు. సాధారణ కీహోల్ ఓపెనింగ్‌తో అన్ని రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.


Next Story