తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1556 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,20,043 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా

By Medi Samrat  Published on  15 Jun 2021 2:30 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,20,043 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా 1,556 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కి చేరింది. నిన్న ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,510కి పెరిగింది. నిన్న 2,070 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,82,993కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 19,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా ఖ‌మ్మంలో 131 కేసులు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 182 కేసులు న‌మోదు అయ్యాయి.




Next Story