తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1436 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 97,751 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా

By Medi Samrat  Published on  6 Jun 2021 2:46 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 97,751 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా 1,436 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. నిన్న ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,378కి పెరిగింది. నిన్న 3,614 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,60,776కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 27,016 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 184 కేసులు న‌మోదు అయ్యాయి.



Next Story