తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1380 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన

By Medi Samrat  Published on  7 Feb 2022 2:15 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 68,720 కరోనా పరీక్షలు చేయగా.. 1,380 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,78,910కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఒక్క‌రు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,101కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,877 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 7,50,809కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 24,000 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల‌లో జీహెచ్ఎంసీలో 350, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో 105 ఎక్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.


Next Story
Share it