తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1175 Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,24,907శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా

By Medi Samrat  Published on  22 Jun 2021 1:41 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,24,907శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా 1,175 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,15,574కి చేరింది. నిన్న ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,586కి పెరిగింది. నిన్న 1,771 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,95,348కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 133 కేసులు న‌మోదు కాగా.. న‌ల్లొండ‌లో 70, సూర్యాపేట‌లో 74, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 70 కేసులు న‌మోదుఅయ్యాయి.





Next Story
Share it