ఈ దసరాకు మనోళ్లు బాగా తాగేశారుగా..!

1128 crores worth liquor sale in Telangana on Dussera. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల్లో రూ. 1128 కోట్ల విలువైన మద్యం విక్రయాలు

By Medi Samrat  Published on  7 Oct 2022 9:02 AM GMT
ఈ దసరాకు మనోళ్లు బాగా తాగేశారుగా..!

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల్లో రూ. 1128 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగినట్టుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. దసరాకు ముందు రోజు తర్వాతి రోజున మద్యం విక్రయాలు ఎక్కువగా సాగినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుండి ఈ నెల 4వ తేదీ వరకు మద్యం డిపోల నుండి వైన్స్ దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా అయింది. గత నెల 25 నుండి ఈ నెల 4వ తేదీ వరకు మద్యం డిపోల నుండి రూ. 1320 కోట్ల మద్యం సరఫరా అయింది. ఈ నెల 3న రూ. 138 కోట్లు, 4న 192 కోట్లు, సెప్టెంబర్ 30న ఒక్క రోజే రూ. 313.64 కోట్ల మద్యం సరఫరా జరిగింది.

సెప్టెంబర్ 25, ఈ నెల 2న మిహహాయించి రోజుకు సగటును రూ. 165 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ. 500 కోట్ల మద్యం విక్రయాలు సాగాయని ఎక్సైజ అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ లో రూ. 149 కోట్లు, నల్గొండలో రూ. 294కోట్లు, కరీంనగర్ లో రూ. 111 కోట్లు, హైదరాబాద్ లో రూ. 108 కోట్ల మద్యం వ్యాపారం సాగింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన రూ. 171.17 కోట్లు సరఫరా అయింది. మద్యం విక్రయాల ద్వారా వారం రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ. 928 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు లిక్కర్ విక్రయాల ద్వారా రూ. 26 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.


Next Story