తెలంగాణ‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

1078 New Corona Cases In Telangana. తెలంగాణ‌లో మ‌రోమారు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా శనివారం ఒక్క‌రోజే

By Medi Samrat  Published on  3 April 2021 4:39 AM GMT
తెలంగాణ‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

తెలంగాణ‌లో మ‌రోమారు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా శనివారం ఒక్క‌రోజే వెయ్యికిపైగా కేసులు నమోద‌వ‌డం ఆందోళన రేకెత్తిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుద‌ల చేసిన‌ హెల్త్ బులిటెన్‌లో.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. ఇక మహమ్మారితో తెలంగాణ‌లో మరో ఆరుగురు మృతిచెందారు. తాజాగా 331 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3,116 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

తాజాగా నమోదైన కేసులలో రాష్ట్రంలోనే అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. మృతుల సంఖ్య 1,712కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ తర్వాత రంగారెడ్డిలో 104, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 113, నిజామాబాద్‌లో 75, సంగారెడ్డిలో 46, జగిత్యాలలో 40, నిర్మల్‌లో 40, కరీంనగర్‌లో 34 కేసులు రికార్డయ్యాయి.


Next Story
Share it