క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టిస్తున్న ప్ర‌కంప‌న‌లు తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలోనే భార‌త్‌తో పాటు చాలా దేశాలు లాక్‌డౌన్‌లు ప్ర‌క‌టించ‌గా.. మ‌న రాష్ట్రం తెలంగాణలో కూడా మార్చి 22నుండి ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.

లాక్‌డౌన్‌లో బాగంగా మద్యం దుకాణాలు, బార్లు మార్చి 31వ‌ర‌కు మూసే ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్ణ‌యించింది. అయితే.. క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేఫ‌థ్యంలో ఆ గ‌డువును కాస్త పొడిగిస్తూ ఈ నెల 14వ‌ర‌కూ మ‌ద్యం దుకాణాలు, బార్లు మూసే ఉంచాలంటూ ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే.. ఈ విష‌య‌మై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. మద్యం దుకాణాల మూసివేత గడువు నిజానికి నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు తెరిచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే, కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన‌ట్లు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.