తెలంగాణలో మద్యం షాపులు అప్పటివరకూ బంద్.. ఉత్తర్వులు జారీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 April 2020 9:13 AM ISTకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న ప్రకంపనలు తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే భారత్‌తో పాటు చాలా దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించగా.. మన రాష్ట్రం తెలంగాణలో కూడా మార్చి 22నుండి ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు.
లాక్‌డౌన్‌లో బాగంగా మద్యం దుకాణాలు, బార్లు మార్చి 31వరకు మూసే ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. అయితే.. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేఫథ్యంలో ఆ గడువును కాస్త పొడిగిస్తూ ఈ నెల 14వరకూ మద్యం దుకాణాలు, బార్లు మూసే ఉంచాలంటూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే.. ఈ విషయమై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మద్యం దుకాణాల మూసివేత గడువు నిజానికి నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు తెరిచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే, కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.