ఆ కేసుల్లో తెలంగాణనే టాప్.. మరీ పోలీసులు ఏం చేస్తున్నట్టు?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 1:23 PM ISTబాల్యాన్ని చిదిమేస్తున్న కామాంధులు
నేషన్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2017 నివేదిక ప్రకారం, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (పోక్సో) కేసుల విషయానికి వస్తే 29 రాష్ట్రాలలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం, తెలంగాణలో పిల్లలపై లైంగిక నేరాల రేటు 14.6 శాతం. మిజోరాం, సిక్కిం, అండమాన్, నికోబార్ దీవులు, ఢీల్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో నేరాల రేటు 2.4 శాతం నమోదయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ తరువాతి స్థానాల్లో కేరళ 13శాతం, తమిళనాడు 10 శాతం కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 2019లో హైదరాబాద్ స్థానిక కోర్టు మూడు చిన్నారుల లైంగిక వేధింపుల కేసులలో శిక్ష విధించింది. 2018 సవరణ తరువాత అక్టోబర్ 16న, హైదరాబాద్‌లోని ఒక స్థానిక కోర్టు మొదటి సారిగా ఒక పోస్కో నిందితుడికి 20 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నాలుగేళ్ల మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో మైనర్ కుమార్తెపై ఐదు ఏళ్లుగా అత్యాచారం చేసినందుకు తండ్రికి ఈ నెల ప్రారంభంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల వయస్సు నుండే చిన్నారిపై అత్యాచారానికి తండ్రి తెగపడ్డాడు. ఇలాంటి మరో సంఘటనలో మైనర్ బాలుడిని లైంగికంగా వేధించినందుకు పోక్సో కేసును విన్న హైదరాబాద్ స్థానిక కోర్టు 20 ఏళ్ల యువకుడికి 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది.
హైదరాబాద్‌లోని అడిషనల్ మెట్రో సెషన్స్ కోర్టు అడిల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె ప్రతాప్ రెడ్డి న్యూస్ మీటర్‌తో నివేదికపై స్పందిస్తూ, 2019లో, పోక్సో కేసులను పరిష్కరించడానికి దేశం అంతటా 540 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అందులో 9 కోర్టులు మాత్రమే తెలంగాణకు కేటాయించ బడ్డాయి. హైదరాబాద్‌లో పరిష్కరించడానికి ఇంకా 385 కేసులు పెండింగులో ఉన్నాయి. నేరారోపణ రేటు పెరిగినప్పుడే నేరాల రేటు నెమ్మదిగా తగ్గుతుంది.
2015 నుంచి నేరాల రేటు పెరుగుతోంది
2015 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పిల్లలపై లైంగిగా వేధింపుల కేసులు పెరిగాయని నివేదిక పేర్కొంది. పిల్లలపై నేరాల విషయానికి వస్తే ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ 13వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలపై నేరాలకు సంబంధించి 3,580 కేసులు నమోదయ్యాయి. ఇందులో 45 శాతం కేసులు దర్యాప్తు పేరుతో పెండింగ్ లో ఉన్నాయి.మహారాష్ట్ర 15.1 శాతంతో మొదటి స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లు 14.1 శాతం తో టాప్ స్థానాలలో ఉన్నాయి. 2017 నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ లలో మాత్రమే పిల్లలపై 10% కన్నా తక్కువ నేరాలు జరిగాయి. మనుషుల అక్రమ రవాణా కేసుల విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.