బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

By అంజి  Published on  8 March 2020 7:53 AM GMT
బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

తెలంగాణ ఆర్థిక బడ్జెట్‌ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇందులో రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు, సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలను మంత్రి తన ప్రసంగంలో ఉటకించారు. కేంద్రం సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా ముందుకెళ్తున్నామని తెలిపారు.

అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా శాఖల వారిగా చేసిన కేటాయింపులను వివరించారు. రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు, మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు, మున్సిపల్‌శాఖకు 14,809 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు, పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌కు రూ.2.650కోట్లు, సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైద్య రంగానికి రూ.6,156 కోట్లు కేటాయించిన మంత్రి హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు చేస్తున్నట్లు తెలిపారు. పచాయతీరాజ్‌ శాఖకు రూ.23,005 కోట్లు, కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు చేశారు. గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు, మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు, సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు, రవాణా, రోడ్లు భవనాలశాఖకు రూ.3494 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు, అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు, పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు, ఎస్‌డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు, పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు కేటాయించారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామన్న హరీష్‌రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480కోట్లు కేటాయిస్తున్న తెలిపారు. కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ల నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ.550 కోట్లు కేటాయించారు. దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయింపులు చేశారు.

Next Story