ఏపీ ఆర్టీసీ బస్సు ఢీ.. తెలంగాణ కండక్టర్ మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:56 AM GMTహైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కోహెడ గ్రామానికి చెందిన విజయ, రమణారెడ్డిగా గుర్తించారు. రమణారెడ్డి బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. కండక్టర్ రమణారెడ్డి మృతితో పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. రమణారెడ్డి దంపతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ హైవేను ఆర్టీసీ కార్మికులు, ప్రజలు దిగ్భందం చేశారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక ఎమ్మెల్యే లేదా కలెక్టర్ వచ్చి బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.