పిజ్జా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రులు..!

By అంజి  Published on  28 Nov 2019 11:15 AM GMT
పిజ్జా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రులు..!

హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో చిసియానో పిజ్జా సెంటర్‌ను మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ పథకం కింద కురసం గౌతమి ఈ పిజ్జా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పిజ్జా సెంటర్‌లో పనిచేసే మా గిరిజన బిడ్డలు సీఎం కేసీఆర్‌ ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం వల్ల ఆ పిజ్జా సెంటర్లకు నేడు యజమానులుగా మారడం సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన బిడ్డలను ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి ముందుకు నడిపిస్తున్నారని సీఎం కేసీఆర్‌ను కొనియాడారు. మీకు అండగా నేను ఉన్నాను అంటూ ప్రతి ఏటా 100 మంది గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన బిడ్డలకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌ చేయూత నివ్వాలి అని కోరుకుంటున్నా మంత్రి సత్యవతి చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గిరిజన యువతీయువకులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. యువ పారిశ్రామికవేత్తల కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అందలో భాగంగా ఇవాళ హిమాయత్‌నగర్‌ పిజ్జా షాపును ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, స్పెషల్ సి ఎస్ సోమేశ్ కుమార్, ట్రైకార్ డి.జి.ఎం శంకర్ రావు, గిరిజన శాఖ అధికారులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Next Story
Share it