హైదరాబాద్‌: తెలంగాణ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడారు. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రేపు ఉందయం 6 గంటల వరకు రోడ్డు మీదకు ఒక్కరు వచ్చిన అరెస్ట్‌ చేసి కేసులు పెడతామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావొద్దని.. అలా వస్తే పాస్‌ పోర్టు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Also Read: తెలంగాణ లాక్‌డౌన్ గురించి తెలుసుకోవాల్సిన 14 విషయాలు

కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం మార్చ్‌ 31 వరకు లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు పర్మిషన్‌ లేదని.. పక్కనే ఉన్న షాప్‌ల వరకు వాహనాలకు అనుమతి అని.. దూరం ప్రాంతాలకు అనుమతి లేదని తెలిపారు. వారం, పది రోజులు మనం గృహ నిర్బంధం అయితే సమస్యను కట్టడి చేయవచ్చన్నారు. ఫుల్‌ కంట్రోల్‌ రావాలి అంటే.. అందరూ లాక్‌ డౌన్‌ పాటించాలన్నారు. మానవాళి మనుగడ ఉండాలి అంటే లాక్‌డౌన్‌ అందరూ సీరియస్‌గా తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు.

Also Read: ఏపీ క‌రోనా నాలుగు పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్‌కు లింక్.!

లాక్‌డౌన్‌ పట్టించుకొని రాష్ట్రాల్లో కరోనా మరణాలు విపరీతంగా పెరిగాయన్న ఆయన.. కూరగాయలు, పెట్రోల్‌ బంక్, షాప్స్‌ అన్ని సాయంత్రం 7 గంటల కల్లా మూసేయాలన్నారు. బైక్‌లకు రోడ్లపై అనుమతి లేదని, ఒక్క కిలోమీటర్‌ వరకు బైక్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఆదేశాలు జారీ చేస్తామని, రోడ్డు మీద వాహనం కనబడితే సీజ్‌ చేస్తామని చెప్పారు. విషయం తెలిసి కూడా మళ్లీ మళ్లీ కనబడితే కేసులు తప్పవని డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లకు మాత్రమే రోడ్లపై అనుమతి ఇస్తామన్నారు. 1897 చట్టం చాలా కఠినమైనదని ఆయన చెప్పారు. దయచేసి రిక్వెస్ట్‌ చేస్తున్నామని, అందరి భవిష్యత్తుతో ఆటలాడుకునే హక్కు మనకి లేదని అన్నారు. కాలనీలో తిరిగే వాహనాలు బైక్‌పై ఒకరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రతి చౌరస్తాలో చెక్‌పోస్టు పెడుతున్నామని చెప్పారు. హోమ్‌గార్డు నుంచి కమిషనర్‌, ఎస్పీలు, ఐజీ, డీజీ అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.