తెలంగాణ లాక్‌డౌన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు

1. రాష్ట్రానికి సంబంధించిన అన్ని బోర్డర్లను మూసివేశారు.

2.పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సర్వీస్ అయిన తెలంగాణ ఆర్టీసీ, లోకల్ సెట్విన్, హైదరాబాద్ మెట్రో ట్రైన్స్, క్యాబులు, టాక్సీలు, ఆటో రిక్షాలను ఆపేశారు. ఎమర్జెన్సీకి సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలపై కూడా పలు ఆంక్షలను విధించారు. కొన్ని అవసరాలకు సంబంధించి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

3. ఇంటర్-స్టేట్ బస్ సర్వీసులను కూడా ఆపివేస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు కూడా ఎటువంటి అనుమతి లేదు..

4.ఎవరెవరిని అయితే హోమ్ క్వారెంటైన్ లో ఉంచుతారో వారు తప్పని సరిగా ఉండాలి. లేదంటే వారందరినీ ప్రభుత్వానికి చెందిన క్వారెంటైన్ హోమ్ లలో ఉంచుతారు.

5. ప్రజలెవరూ ఇళ్లలో నుండి బయటకు రాకూడదని.. కేవలం ఒక్కరు మాత్రమే ఇంటి నుండి బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లాలని చెబుతున్నారు. వాహనాన్ని నడిపే వాళ్లెవరు ఉన్నా.. వారి వెనుక మరొకరు వెళ్ళవచ్చు.

6. అయిదు మంది కంటే ఎక్కువ మంది ప్రజలు గూమికూడడం నిషిద్ధం.

7.బ్యాంకులు, ఏటీఎంలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెలికం, తపాలా, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫార్మా, రవాణా, తయారీ రంగాలకు, ఆప్టికల్ దుకాణాలు, అంతర్జాల సేవల విభాగాలు పనిచేయవచ్చు.

8.ప్రభుత్వరంగ సంస్థలు, షాపులు ఏవైతే తెరవడానికి అనుమతి ఇచ్చారో వాటన్నిటిలోనూ సామాజిక దూరం పాటించవలసిందే. చెక్ అవుట్ కౌంటర్ల వద్ద దాదాపు మూడు అడుగుల దూరం ఉంచాలి. ప్రతి ఒక్క చోట కూడా హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లను ఉపయోగించాలి.

9.ఏటీఎం లు కూడా తప్పనిసరిగా పనిచేయాలి. నిత్యావసర వస్తువుల దుకాణాలు (సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు), రెస్టారెంట్లలో టేక్ అవే, హోమ్ డెలివరీ, ఎల్పీజీ గ్యాస్ కంపెనీలు, పెట్రోల్ బంకులు, వీటి సంబంధిత రవాణా, అన్ని రకాల సెక్యూరిటీ సేవలు, కరోనా నియంత్రణకు సహకరించే ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్టులకు లాక్ డౌన్ వర్తించదు.

10.ఈ సంస్థలు, డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా పని చేయాల్సిందే
a) డిస్ట్రిక్ట్ కలెక్టరేట్/డివిజనల్ ఆఫీసులు/మండల ఆఫీసులు
b)పోలీసు
c)హెల్త్
d)ఫైర్
e)అర్బన్ లోకల్ బాడీస్/పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్
f)టాక్సేషన్, ఎక్సయిజ్, కమర్షియల్ టాక్స్, ట్రాన్స్ పోర్ట్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్
g)ఎలెక్ట్రికల్ అండ్ వాటర్ సప్లై
h)అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, అగ్రికల్చర్ మార్కెటింగ్
i) సివిల్ సప్లై
j) రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ అయిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లీగర్ మెట్రోలజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లు పని చేస్తాయి
k)పైవాటికి చెందిన అన్ని ప్రభుత్వ ఆఫీసులు పని చేస్తాయి.

11. లాక్ డౌన్ పిరియడ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంస్థ ఉద్యోగులకు పూర్తీ జీతాలు చెల్లించాల్సిందే అని ప్రభుత్వం తెలిపింది.

12.అన్ని విద్యారంగ సంస్థలు మూసివేస్తున్నామని.. స్పాట్ వాల్యుయేషన్ కూడా మార్చి 31, 2020 వరకూ ఆపివేస్తున్నామని అన్నారు. అన్ని పరీక్షలను పోస్ట్ పోన్ చేస్తున్నామని అన్నారు.

13. అంగన్వాడీ సెంటర్లను కూడా మార్చి 31, 2020 వరకూ మూసివేస్తున్నామని.. గర్భవతులకు, బాలింత‌లకు అందాల్సిన వాటిని ఇళ్లకే పంపిస్తున్నామని అన్నారు.

14. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలన్నింటినీ ఆపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.