వారు కూడా పోటీకి అర్హులే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 10:13 AM GMT
వారు కూడా పోటీకి అర్హులే..!

హైదరాబాద్:ఇద్దరూ అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి అర్హులేనన్నారు మంత్రి కేటీఆర్. మండలిలో మంత్రి కేటీఆర్ మాడుతూ... మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పని తీరుపై మూడు నెలలకోసారి 'సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కమిటీ' మానిటరింగ్ చేస్తుందన్నారు. పని చేయని వారిపై పార్టీలతో సంబంధం లేకుండా వేటు వేస్తామన్నారు.ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడమన్నారు.

ఫ్లెక్సీలు కడితే నాయకత్వ లక్షణాలు రావని.. ప్రజల్లో ఉంటేనే నాయకత్వ లక్షణాలు వస్తాయన్నారు కేటీఆర్. కేంద్రం ప్లాస్టిక్ చట్టం తీసుకువస్తే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఈ దఫా మండలిలో మునిసిపల్ చట్టంలో ఐదు సవరణలు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ చట్టాన్ని చాలా కఠినంగా రూపొందించామని..తప్పు చేసిన ఎవరినైనా శిక్షిస్తామన్నారు.

75 గజాల లోపు స్థలాలు ఉన్న వారు ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చాన్నారు మంత్రి కేటీఆర్ . 76 - 600 గజాల స్థలం ఉన్న వారు ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాలన్నారు. దీనికి 21 రోజుల్లో అనుమతి ఇస్తామని కేటీఆర్ తెలిపారు. ఇల్లు పర్మిషన్ తీసుకుని 6 నెలల్లో కట్టకపోతే పర్మిషన్ రద్దవుతుందన్నారు. మూడేళ్ళలో మొత్తం ఇల్లు పూర్తి చేయాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ఉన్న అన్ని ప్రార్థన మందిరాలను తొలగిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Next Story
Share it