తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడే..!

By Newsmeter.Network  Published on  6 April 2020 10:47 AM IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడే..!

లాక్ డౌన్ పూర్తీ అవ్వగానే తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు వీలైనంత త్వరగా పేపర్ల కరెక్షన్ చేయించాలని భావిస్తోంది. మూల్యాంకనం తొందరగా పూర్తీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు సంబంధించిన పేపర్ కరెక్షన్లు వీలైనంత త్వరగా పూర్తీ చేయాలని అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. ఎక్కువ మంది లెక్చరర్లను తీసుకుని పేపర్ కరెక్షన్ ను తొందరగా పూర్తీ చేయాలని భావిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే మూల్యాంకనం ఆలస్యం అవ్వడంతో ఇంటర్మీడియట్ బోర్డు వీలైనంత వేగంగా పని పూర్తీ చేయాలని భావిస్తోంది.

Als0 Read :బిగ్‌ బ్రేకింగ్‌: రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..!

ఇంటర్మీడియెట్ బోర్డు మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15 కంటే ముందే పూర్తీ చేయాలని భావించింది. కానీ పరిస్థితుల్లో చాలా మార్పులు రావడంతో పేపర్స్ కరెక్షన్స్ ను ఆపేసారు. 12 సెంటర్లలో.. 800 మందితో మూల్యాంకనాన్ని ముందే మొదలుపెట్టగా.. వాటిని కూడా ఆపివేశారు. ఏప్రిల్ నెల చివరి వారంలో పరీక్షల రిజల్ట్ ను వెల్లడించాలని బోర్డు భావించింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ను నిర్వహించడంతో బోర్డు వేసిన ప్రణాళిక మొత్తం రద్దు చేయాల్సి వచ్చింది. తాము మూల్యాంకనం చేసే లెక్చరర్లను మరి కొంతమందిని తీసుకోవాలని అనుకుంటూ ఉన్నామని.. కరెక్షన్స్ చేసే సెంటర్ల సంఖ్య కూడా పెంచాలని భావిస్తున్నామని, వీలైనంత త్వరగా పేపర్స్ కరెక్షన్స్ ను పూర్తీ చేసి.. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నామని సీనియర్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.

Also Read :కరోనాపై పోరులో.. వైద్యుల రక్షణ కోసం పీపీఈలు.. త్వరలో అందుబాటులోకి

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుండి 23 మధ్య జరిగాయి. మొత్తం 9,65,875 మంది పరీక్షలకు అప్లై చేసుకున్నారు. 4,80,531 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, 4,85,344 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. 1339 సెంటర్లలో, 26964 ఇన్విజిలేటర్ల సమక్షంలో పరీక్షలు జరిగాయి. మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2 పరీక్షలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. మూల్యాంకనం, ఫలితాలకు సంబంధించి ఎటువంటి తప్పులకు తావు లేకుండా అన్ని చర్యలూ చేపట్టామని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు.

Also Read :లాక్‌డౌన్‌ బూచీతో అడ్డగోలుగా ధరలు.. కొండెక్కిన కోడిగుడ్డు

Next Story