బిగ్‌ బ్రేకింగ్‌: రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..!

By సుభాష్  Published on  6 April 2020 4:52 AM GMT
బిగ్‌ బ్రేకింగ్‌: రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఈనెల 14వ తేదీ నాటికి లాక్‌డౌన్‌ సమయం ముగియనుంది. ఈ లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అయితే ఈనెల 15 తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నట్లు తెలుస్తోంది. బస్సులో అందుబాటులోకి వస్తాయనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. 15 తర్వాత బస్సులను పునరుద్దరించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ముందే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్న కారణంగా బస్సులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి.

ఈ మేరకు 15 నుంచి ఆన్‌లైన్‌లో బస్‌ టికెట్లు బుక్‌ చేసుకుకోవచ్చని తెలుస్తోంది. దూర ప్రాంతానికి వెళ్లే ఏసీ బస్సులను నడపకూడదని ఏపీ ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులను రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించినట్లు సమాచారం. కాగా, వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి మాత్రమే ఏసీ బస్సులను నడపనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ ఏసీ బస్సులో త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు కరోనా ప్రభావం కారణంగా దశలవారీగా ఏసీ బస్సులను నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, ఒక వైపు ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కానీ చివరి సమయంలో లాక్‌డౌన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story