లాక్‌డౌన్‌: కేంబ్రిడ్జ్ విద్యావేత్తల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

By సుభాష్  Published on  5 April 2020 1:56 PM GMT
లాక్‌డౌన్‌: కేంబ్రిడ్జ్ విద్యావేత్తల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

దేశంలో కరోనా మహమ్మారి కాటేస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనుంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించేది లేదని కేంద్రం సంకేతాలు వెలువడుతుండగా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

భారత్‌లో ఒక లాక్‌డౌన్‌ సరిపోదని, మూడు దశల లాక్‌డౌన్‌ విధించాలని పేర్కొన్నారు. అప్పుడే కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ పూర్తయ్యాక, ఐదు రోజులు విరామం ఇచ్చి రెండో దశలో28 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించాలని సూచిస్తున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. వైరస్‌ ఎక్కువ వ్యాప్తి చెందే నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడగిస్తే మరి కొంత బాగుంటుందని వారు చెబుతున్నారు.

రెండో దశ లాక్‌డౌన్‌ పూర్తయ్యాక మరో ఐదు రోజులు విరామం ఇచ్చిన తర్వాత 18 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించాలని సూచిస్తున్నారు. మూడో విడత అనంతరం పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా నమోదువుతాయని, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోతుందని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ చెందిన విద్యావేత్తలు రాజేష్‌, అధికారి అధ్యయనంలో పేర్కొన్నారు.

Next Story