కరోనా: మోదీ సంచలన నిర్ణయం..!

By సుభాష్  Published on  4 April 2020 2:29 PM GMT
కరోనా: మోదీ సంచలన నిర్ణయం..!

కరోనా ప్రపంచ వ్యాప్తంగా కాటేస్తోంది. ఇక భారత్‌లో కూడా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక విదేశాల్లో ఉన్న కరోనా కేసుల సంఖ్యతో పోల్చుకుంటే మరో దేశంలో తక్కువేనని చెప్పాలి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపడుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.

కాగా, మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స, కరోనా పరీక్షలు వంటి వాటిని ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన్‌ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కోవిడ్‌ -19 పరీక్షలు ప్రజలకు ఉచితంగానే అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే కేంద్ర సర్కార్‌ నిర్ణయంతో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అర్హులైన 50 కోట్ల మందికి కరోనా పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు. ప్రైవేటు ల్యాబ్స్‌ కూడా వీరికి ఉచితంగానే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) వెల్లడించింది.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు రంగానికి సంబంధించి కూడా నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా పరీక్షలు, చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌ కిందకు తీసుకురావడం వల్ల కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ ద్వారా ప్రైవేటు రంగ సాయంతో కరోనా వైరస్‌ పరీక్షలు, చికిత్స సదుపాయాలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఐసీఎంఆర్‌ నిబంధన ప్రకారం అన్ని ప్రైవేటు ల్యాబ్స్‌కు కోవిండ్‌ -19 పరీక్షలు అనుమతులు లేవు. కేవలం ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు ఉన్న ల్యాబ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.

Next Story