దేశంలో కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో దేశంలో కరోనా కేసులు, మరణాలు పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయాయి. కారణంగా ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. దీంతో లాక్‌డౌన్‌ను కూడా కఠినంగా అమలు చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పొక్రియల్‌ మీడియాతో మాట్లాడారు. విద్యాసంస్థల పునః ప్రారంభంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగియనుందని, ఇక లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతే విద్యాసంస్థల పునః ప్రారంభం విషయంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని చెప్పారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్ర తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పెండింగ్‌లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

సుభాష్

.

Next Story