తెలంగాణలో జూన్ 30 వరకు లాక్‌డౌన్.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 12:16 PM GMTకేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ను జూన్ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల జూన్ 7 వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు.
రాత్రి పూట కర్ఫ్యూ ను సైతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వరకు అమలు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా ఇతర వాణిజ్య సముదాయాలు రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై నిషేదం ఎత్తి వేసింది. దీంతో.. ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే ఇతర రాష్ట్రాలకు ప్రయాణించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో.. రెస్టారెంట్లు, మాల్స్ వీటి విషయంలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా సినిమా షూటింగ్స్ అనుమతికి సంబంధించి కూడా ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.