కేటీఆర్ తాగుతుంది.. 'కల్లా'.. 'నీరా'..?
By సుభాష్ Published on 4 Jan 2020 9:26 PM ISTహైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ గౌడ ఆత్మీయ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సభా వేదికపైనే కేటీఆర్ 'నీరా' తాగి అందరిని ఆశ్చర్యపర్చారు. ఇలా కేటీఆర్ వేదికపైనే నీరా తాగడంతో అది కల్లా.. లేక నీరా.. అంటూ పలువురు జోకులు వేసుకున్నారు. ఈ సభలో కేటీఆర్‌తో పాటు పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హరితహారం పేరుతో గౌడ్స్‌కు ఈత మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గౌడన్నల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఇకపై పెట్టుబడుల కోసం హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రతినిధులకు 'నీరా' టెస్ట్ చూపిస్తానని అన్నారు. గత ప్రభుత్వాలు గౌడ్స్‌ల గురించి పట్టించుకోలేదని, 'నీరా' ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురావడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.