మైనర్‌ బాలికపై నెలల తరబడి అత్యాచారం.. చివరకు గర్భం దాల్చడంతో..

By సుభాష్  Published on  17 Dec 2019 11:09 AM GMT
మైనర్‌ బాలికపై నెలల తరబడి అత్యాచారం.. చివరకు గర్భం దాల్చడంతో..

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ నిత్యం ఏదొక చోట దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కుమురం భీం జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. జైనూరు మండలంలోని ఓ గ్రామంలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడుతున్నారు. తర్వాత బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. ఈ కారణంగా బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

సదరు బాలిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తమ్ముడితో కలిసి నాయనమ్మ వద్ద ఉంటోంది. రోజూ కూలి పనులకు చేసుకుంటూ జీవనం వేళ్లదీస్తున్నారు. దీంతో బాలిక తమ్ముడితో కలిసి ఇంట్లోనే ఒంటరిగా ఉండేది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి వరుసకు అన్నదమ్ములైన ఆత్రం ప్రభు(24) పెందూర్‌ శ్రీకాంత్‌(19) బాలికపై కన్నేశారు. బాలిపై ఎలాగైన అత్యాచారం చేయాలని నిర్ణయించుకుని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.

చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో యువకుల తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా ఆర్ఎంపీ వైద్యుడు వద్దకెళ్లి ఆమెకు అబార్షన్ చేయించారు. దీంతో బాలిక అనారోగ్యానికి గురికావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక నాయనమ్మ యువకులను, వారి తల్లిదండ్రులను నిలదీసింది. నిందితులు ఆమె బెదిరించడంతో జైనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను గర్భవతిని చేసిన యువకులతో పాటు వారికి సహకరించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆర్ఎంపీ డాక్టర్‌పైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Next Story
Share it