2న తెలంగాణకు మీరాకుమార్ రాక

Meera Kumar will come to Hyderabad on June 2. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఘనంగా

By Medi Samrat  Published on  30 May 2023 3:30 PM IST
2న తెలంగాణకు మీరాకుమార్ రాక

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఘనంగా నిర్వహించనున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారని వెల్ల‌డించారు. వేడుకల సందర్భంగా గాంధీ భవన్ లో జరిగే సమావేశంలో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు. కార్య‌క్ర‌మంలో మీరా కుమార్ కు టీపీసీసీ తరపున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొననాలని ఆయన పిలిపునిచ్చారు.


Next Story