ఎంసెట్ ఎగ్జామ్ తేదీల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 3:22 PM GMT
ఎంసెట్ ఎగ్జామ్ తేదీల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

క‌రోనా విస్తృతి కార‌ణంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేఫ‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. ఇటీవ‌ల టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు తేదీల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. నేడు ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను ప్ర‌క‌టించింది. తెలంగాణ రాష్ట్ర‌ విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఈ రోజు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు జులై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ ప‌రీక్ష‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె తెలిపారు.

కరోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని మంత్రి స‌బితా పేర్కొన్నారు.

ఎంసెట్- జులై 6 నుంచి 9 వరకు జ‌‌రుగ‌నుండగా.. ఈసెట్ - జులై 4న జ‌రుగుతుంది. ఇక లాసెట్- జులై 10న, టీఎస్ పీజీఈసెట్- జులై 1 నుంచి 3 వరకు జ‌రుగ‌నుండ‌గా.. టీఎస్ పాలిసెట్- జులై 1, ఐసెట్- జులై13న, ఎడ్‌సెట్- జులై 15న జ‌రుగ‌నున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు.

Emcet

Next Story