విలవిల్లాడిన చిన్నారి.. చితకబాదిన టీచరమ్మ.!

By అంజి  Published on  12 Feb 2020 8:58 AM GMT
విలవిల్లాడిన చిన్నారి.. చితకబాదిన టీచరమ్మ.!

హైదరాబాద్‌: నల్లకుంటలో దారుణం ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థిపై టీచర్‌ తన ప్రతాపాన్ని చూపించింది. క్లాస్‌ రూమ్‌లో పాఠాలు చెప్పాల్సిందిపోయి.. రాక్షసురాలిగా ప్రవర్తించింది. సాయి ప్రణీత్‌ సెయింట్‌ ఆగస్టైన్‌ హైస్కూల్‌లో నాల్గవ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఏదో తప్పు చేశాడన్న కోపంతో ప్లాస్టిక్‌ స్కేల్‌తో చేయి, వీపు భాగం కమిలిపోయేలా కొట్టింది. తప్పులు చేస్తే సర్ది చెప్సాల్సింది పోయి కర్కశత్వంగా ఆ టీచర్‌ ప్రవర్తించింది. దీంతో విద్యార్థి చర్మం ఎర్రబడింది. నొప్పితో విలవిల్లాడుతున్నా చిన్నారి వదిలి పెట్టలేదు. 'ఆ టీచర్‌ అరగంట పాటు కొట్టిందమ్మా' అంటూ విద్యార్థి తన తల్లిదండ్రుల దగ్గర ఏడ్చుకుంటూ చెప్పాడు.

Teacher hit the student Hyderabad

కొడుకు ఒంటిపై అయిన వాతలను చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. అయితే ఇదే విషయమై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లారు. తమ కోడుకును ఇలా ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తే.. మీ ఇష్టం వచ్చిన చోట, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. ఆ స్కూల్‌లోని ప్రతి క్లాస్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ ఫుటేజీని పరిశీలించి టీచర్‌పై, పట్టించుకోని స్కూల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

2 3

Next Story