టీడీపీకి బిగ్ షాక్.. కీల‌క నేత వైసీపీలోకి జంప్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Dec 2019 7:32 AM GMT
టీడీపీకి బిగ్ షాక్.. కీల‌క నేత వైసీపీలోకి జంప్..!

నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్‌ బై చెప్పారు. తాజాగా.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేరకు మస్తాన్‌రావు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత‌ చంద్రబాబుకు పంపారు. మస్తాన్‌రావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక.. మస్తాన్‌రావు శనివారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని స‌మాచారం.

కాగా.. ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రవిచంద్రకు అధినేత‌ చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తున్న బీద మస్తాన్‌రావు పార్టీకి రాజీనామా చేయడం నెల్లూరు టీడీపీకి భారీ నష్టంగానే చెప్పాలి.

Next Story
Share it