టీడీపీ సీనియర్‌ నేత బడేటి బుజ్జి హఠాన్మరణం

By అంజి  Published on  26 Dec 2019 2:45 AM GMT
టీడీపీ సీనియర్‌ నేత బడేటి బుజ్జి హఠాన్మరణం

పశ్చిమగోదావరి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గుండె పోటుతో మృతి చెందారు. బుధవారం అర్థరాత్రి బడేటి బుజ్జికి ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు బుజ్జిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా బుజ్జి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బుజ్జి మరణవార్తను తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వస్తున్నారు. బుజ్జి 2014 ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా గత ఎన్నికల్లో ఆళ్ల నాని చేతిలో ఓటిమి పాలయ్యారు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు బడేటి బుజ్జి. ఏలూరులో టీడీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. టీడీపీలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగిన బుజ్జి.. మున్సిపల్‌ కౌన్సిలర్‌, చైర్మన్‌గా కూడా పని చేశారు. బడేటి బుజ్జి ఆకస్మిక మరణంతో టీడీపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు బుజ్జి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఫోన్‌ పరామర్శించి, ధైర్యంగా ఉండాలన్నారు. పలువురు నాయకులు బుజ్జి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

Next Story
Share it