ఆ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2019 3:45 PM IST![ఆ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.! ఆ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/11/Biswa-Bhushan-Harichandan.jpg)
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్‌ను టీడీపీ నేతలు కలిశారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అఖిల ప్రియపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అఖిల్ ప్రియ భర్తపై రెండు తప్పులు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులపై గవర్నర్‌ని కలిసి వివరించామని వర్ల రామయ్య తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతోందని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. గవర్నర్‌ని కలిసి తప్పుడు కేసులు గురించి వినతి పత్రం ద్వారా తెలియజేశామని పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో 40 తప్పుడు కేసులు పెట్టారని.. తప్పుడు కేసులపై విచారణ జరిపించాలని అఖిల ప్రియ పేర్కొన్నారు.