స్పీకర్ వ్యవస్థను టీడీపీ నేతలు మంట కలుపుతున్నారు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Nov 2019 4:59 PM ISTఅమరావతి: స్పీకర్‌పై చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. టీడీపీ వెబ్‌సైట్‌లో స్పీకర్‌ను కించపరుస్తూ వార్త రాశారాని మండిపడ్డారు. వెబ్‌సైట్‌లో వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు అగ్ర కుల ఆహంకారం ఎక్కువ. స్పీకర్ స్థానాన్ని అవమాన పరిచేలా ఎలా మాట్లాడుతారని జోగి రమేష్ ప్రశ్నించారు. వెబ్‌సైట్‌లో స్పీకర్‌ను కించ పరుస్తూ రాసిన వార్తలపై చంద్రబాబు, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్‌పై రాసిన వార్తలపై సీఎం, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ్మినేనిని స్పీకర్‌గా ఎన్నిక చేస్తే చంద్రబాబు దూరంగా ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన వారు స్పీకర్‌గా ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారు. స్పీకర్ వ్యవస్థను టీడీపీ నేతలు మంట కలుపుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు. స్పీకర్‌పై ఎందుకు వ్యక్తి గతంగా విమర్శలు చేస్తున్నారో అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సభను హుందాగా నడిపిస్తున్నారు. బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న టీడీపీని భూస్థాపితం చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.