చంద్రబాబుపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 11:14 AM IST
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో నందిగామ బార్ అసోసియేషన్ సభ్యుడు లాయర్ బి.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల లో నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ కు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమాలు ఉండటంతో రోడ్డు మార్గాన విజయవాడ చేరుకున్నారు. అక్కడే రెండు రోజుల పాటు ఆ కార్యక్రమాలు చూసుకున్నారు. కానీ అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. తన కుమారుడు, పార్టీ యువనేత నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లారు.
ఏపీలో పర్యటనకు ముందు ఆయన ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగుపెట్టిన అనంతరం విశాఖలోని బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్. కరోనా కేసుల కలకలం కొనసాగుతున్న తరుణంలో ఆ వైరస్‌కు భయపడే బాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయారా? అంటూ సోషల్ మీడియాలో సహజంగానే సెటైర్లు పేలుతున్నాయి.