నారా లోకేష్‌కు షాకిచ్చిన వైసీపీ నేతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Nov 2019 5:01 PM IST- డీఆర్సీ నుంచి లోకేష్ బహిష్కరణ
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వైసీపీనేతలు దూకుడు పెంచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు షాకిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు గుంటూరు లోని జడ్పీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయమై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటు పడినట్లయింది.
దీంతో ఇకపై డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు లోకేష్‌కు అవకాశం లేకుండా పోయింది. జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఈ వ్యవహారంపై వాడీవేడి చర్చ జరిగింది. కాగా, గత ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇన్‌చార్జి మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో నారా లోకేష్‌పై వేటు వేయడం గమనార్హం. ఈ సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.