ఆయనో బూతు మంత్రి..!: టీడీపీ నేత వర్ల రామయ్య

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 10:42 AM GMT
ఆయనో బూతు మంత్రి..!: టీడీపీ నేత వర్ల రామయ్య

ముఖ్యాంశాలు

  • మంత్రి కొడాలి నానిపై తీవ్రంగా మండిపడ్డ వర్ల రామయ్య
  • కొడాలి నానిని బూతు మంత్రి అంటూ సంభోదించిన వర్ల రామయ్య
  • హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలని జీవో ఉంది

అమరావతి: కొడాలి నాని బూతుల మంత్రి అంటూ సంభోదించాడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. బూతులు మాట్లాడే వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారో సీఎం జగన్ చెప్పాలన్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు మంత్రి వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు. 2004లో కొడాలి నానికి సీటు ఇవ్వడం చంద్రబాబు చేసిన తప్పు అన్నారు. అప్పుడు సీటు ఇవ్వకుండా ఉంటే లారీలు తోలుకుంటూ ఉండేవారన్నారు.

హిందూ దేవాలయాల్లోకి అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని 1990లో జీవో 311 జారీ అయిందన్నారు. ప్రభుత్వ జీవోలు చదవాలనే ఆలోచన సీఎం, బూతు మంత్రికి లేదన్నారు వర్ల రామయ్య. రాజ్యాగాన్ని వ్యతిరేకించి సీఎం ప్రవర్తిస్తుంటే ఏం చర్యలు తీసుకుంటారో సీఎస్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తల్లిదండ్రులకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వనందుకు సీఎం వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.

Next Story
Share it