చిత్తూరులో బిజీబిజీగా చంద్రబాబు.!
By Medi Samrat Published on 8 Nov 2019 12:30 PM ISTముఖ్యాంశాలు
- మూడు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరులో చంద్రబాబు
- నేడే చివరి రోజు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత జిల్లా చిత్తూరులో చేపట్టిన మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజైన శుక్రవారం ఉదయం 10గంటలకు చంద్రబాబు తొలుత జిల్లా టీడీపీ సమన్వయ కమిటీతో సమావేశమవుతారు. జిల్లాలో రానున్న కాలంలో పార్టీని ఏ తీరున నడపాలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు.
అనంతరం 11 గంటల నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ చంద్రగిరి, కుప్పం, పూతలపట్టు, జీడీనెల్లూరు, తిరుపతి నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు. 4 గంటలకు మీడియాతో సమావేశమవుతారు. అనంతరం అక్కడ నుంచీ బయల్దేరి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళనున్నారు
Next Story