టీడీపీ ఆవిర్భావ దినోత్సం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

By అంజి  Published on  29 March 2020 6:57 AM GMT
టీడీపీ ఆవిర్భావ దినోత్సం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇవాళ 38వ వసంతంలోకి అడుగు పెట్టింది. 37 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో టీడీపీ ఎన్నో మైలు రాయిలను అధిగమించింది. ఇప్పటికి ఎన్నో విజయాలను, ఎన్నో సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొంది.

TDP Formation day celebrations

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలు వేసి చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నివాళులర్పించారు.

TDP Formation day celebrations

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున టీడీపీ నేతలంతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ ఇళ్లలోనే జరుపుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇళ్లపై తెలుగు దేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్‌ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు' ఇదే టీడీపీ సిద్ధాంతంమని చంద్రబాబు నిన్న పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో అన్నారు. ఎన్టీఆర్‌ చూపిన బాటలో, ఆయన ఆశయాల సాధన కోసం కలిసి నడవాలని చంద్రబాబు సూచించారు.తెలుగు దేశం పార్టీని 1982వ సంవత్సరం మార్చి 29న ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు.

TDP Formation day celebrations

Next Story
Share it