నెల్లూరు: దగదర్తి ఎస్సై వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త కార్తీక్‌ (23) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్‌ ఆత్మహత్యకు ఎస్సైనే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టు నడుచుకోవాలంటూ ఎస్సై వేధించారని, తమ హోటల్‌ను కూడా తొలగించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్‌ కుటుంబ సభ్యులని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నేతలు పరామర్శించారు. జిల్లాలో టీడీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. కలెక్టర్‌, ఎస్పీలకి ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. కింది స్థాయి అధికారులు కూడా వారి మాట వినడంలేదన్నారు. కార్తీక్‌ది ఆత్మహత్య కాదని.. వైసీపీ నేతల కోసం ఎస్సై చేసిన హత్య అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆరోపించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story