చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరులో ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు ఉన్నారు. విధి నిర్వహాణలో పోలీసులు కరోనాకు బలి అవుతున్నారు. వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమను జీవితకాలాన్ని కాపాడాలని ఏకంగా యముడికి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“మేము ఎన్ని కష్టాలు అనుభవించినా.. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ తరువాత పోలీసుల మరణాలపై దయ చూపిస్తారని నమ్ముతున్నాం. ” అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *